News September 26, 2024
అంబులెన్స్‌లో 138 కేజీల గంజాయి స్మగ్లింగ్

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఏకంగా అంబులెన్స్‌లో 138 కేజీల గంజాయిని ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు రవాణా చేస్తోన్న ఇద్దరిని భేరుఘాట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 138 కేజీల గంజాయిని అంబులెన్స్ వెనక భాగంలో చిన్న, పెద్ద ప్యాకెట్లలో దాచినట్లు గుర్తించారు. దీని విలువ మార్కెట్లో రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు.
Similar News
News November 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 73 సమాధానాలు

సమాధానం: పంచ పాండవుల ప్రాణాలు తీసే శక్తి కలిగిన 5 బాణాలను భీష్ముడి నుంచి దుర్యోధనుడు తీసుకుంటాడు. దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడికి పూర్వం అర్జునుడికి, దుర్యోధనుడు వరమిచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. దీంతో ఆయన అర్జునుడిని, దుర్యోధనుడి వద్దకు పంపి ఆ బాణాలు కావాలనే వరం కోరమని చెబుతాడు. ఇచ్చిన వరం కారణంగా, మాట తప్పకూడదు కాబట్టి దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చేస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 21, 2025
పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

AP: టెన్త్ <
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.


