News September 26, 2024

అంబులెన్స్‌లో 138 కేజీల గంజాయి స్మగ్లింగ్

image

గంజాయి అక్రమ రవాణాలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. ఏకంగా అంబులెన్స్‌లో 138 కేజీల గంజాయిని ఒడిశా నుంచి మధ్యప్రదేశ్‌కు రవాణా చేస్తోన్న ఇద్దరిని భేరుఘాట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతోనే వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 138 కేజీల గంజాయిని అంబులెన్స్ వెనక భాగంలో చిన్న, పెద్ద ప్యాకెట్లలో దాచినట్లు గుర్తించారు. దీని విలువ మార్కెట్‌లో రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు.

Similar News

News October 9, 2024

అమ్మవారికి పూల దండ.. వేలంలో ఎంత పలికిందంటే!

image

AP: దసరా సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ఆనవాయితీ నడుస్తుంటుంది. అంబేడ్కర్ కోనసీమ(D) అమలాపురంలోని రమణం వీధిలో ఏటా అమ్మవారి మెడలో వేసే పూల దండకు వేలం పాట నిర్వహిస్తారు. ఈసారి ఓ భక్తుడు రూ.లక్షా మూడు వేలకు పూల దండను దక్కించుకున్నారు. అమ్మవారి మెడలో దండ వేస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 12 ఏళ్ల క్రితం తొలిసారి వేలంపాటలో పూల దండ రూ.5వేలు పలికింది.

News October 9, 2024

దసరా: స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు!

image

TG: దసరా పండుగకు నడుపుతున్న TGSRTC స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.310గా ఉంటే ఇప్పుడు రూ.360 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారిక ప్రకటన చేయలేదు.

News October 9, 2024

పాకిస్థాన్‌కు కొరకరాని కొయ్యగా హ్యారీ బ్రూక్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ (109*) సెంచరీ చేశారు. 9 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో శతకం బాదారు. పాక్‌పై ఆడిన నాలుగు టెస్టుల్లోనూ బ్రూక్ 4 సెంచరీలు చేశారు. ఈ క్రమంలో ఆయన అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. పాక్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా మరో ఇద్దరితో కలిసి రికార్డు నెలకొల్పారు. గతంలో అమర్‌నాథ్, అరవింద డిసిల్వా నాలుగేసి సెంచరీలు బాదారు.