News February 16, 2025
KCR బర్త్‌డే రోజున సామాజిక కార్యక్రమాలు: KTR

TG: BRS అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా FEB 17న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎవరికి తోచిన విధంగా వారు ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టాలని KTR విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 28, 2025
భారత్ ఖాతాలో మరో 3 పతకాలు

ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. ముగ్గురు మహిళా రెజ్లర్లు మెడల్స్ సాధించారు. రీతిక 76 కేజీల విభాగంలో సిల్వర్, ముస్కాన్ (59kgs), మాన్సీ(68kgs) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 5కు (1 సిల్వర్, 4 బ్రాంజ్) చేరింది. ఈ పోటీలు జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్నాయి.
News March 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 28, 2025
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం