News February 27, 2025
మహిళల రక్షణలో సమాజానికీ బాధ్యత ఉంది: జస్టిస్ చంద్రచూడ్

పుణేలోని బస్సులో యువతిపై జరిగిన <<15593054>>అత్యాచారంపై<<>> మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. కేవలం చట్టాలతోనే దురాగతాలను నివారించలేమని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎక్కడికెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని మహిళల్లో కలిగించాలని తెలిపారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ, పోలీసులతోపాటు సమాజానికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు.
Similar News
News March 22, 2025
రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్‌కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.
News March 22, 2025
టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.
News March 22, 2025
IPL: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు

ఇవాళ KKR-RCB మధ్య జరిగే IPL తొలి మ్యాచ్‌కు 80% వర్షం ముప్పు పొంచి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వద్ద నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కూ ఆటంకం ఏర్పడింది. శని, ఆదివారాల్లో నగరంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని కోల్‌కతా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.