News March 28, 2024

అచ్చెన్నాయుడుకు ఊరట

image

AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో అచ్చెన్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.

Similar News

News March 6, 2026

అభిషేక్ మాదిరే వరుణ్‌ను ఎందుకు సపోర్ట్ చేయరు: సెహ్వాగ్

image

నిన్న ENGతో మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటిపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సరిగ్గా ఆడట్లేదు. అతడిని వెనకేసుకొస్తున్న వారికి బౌలర్‌కు సపోర్ట్ చేయడానికి ఎందుకు సమస్య? 3 మ్యాచ్‌లలో రన్స్ ఇవ్వగానే వేరే బౌలర్ కోసం చూస్తున్నామని చెబుతారు. ఆ కొత్త ప్లేయర్ రాణిస్తాడనే గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నించారు.

News March 6, 2026

H1-B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

image

FY 2027కి సంబంధించిన H1-B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు గడువు ఉంది. అయితే ఈసారి అమెరికా నిబంధనలను చాలా కఠినం చేసింది. విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకునే కంపెనీలు లక్ష డాలర్ల అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో కూడా ఎక్కువ శాలరీ, నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యం లభించేలా ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతి తెచ్చారు. సోషల్ మీడియా వెరిఫికేషన్ కూడా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

News March 6, 2026

నేపాల్.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బాలేంద్ర షా పార్టీ

image

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 90కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. నేపాల్‌లో 275 స్థానాలు ఉండగా 165 స్థానాలకు ప్రజల ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మిగిలిన 110 సీట్లను రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. 165 సీట్లలో 84 గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.