News September 11, 2024

సీఎం రేవంత్ సొంత గ్రామంలో సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు

image

TG: సీఎం రేవంత్ సొంత గ్రామం నాగర్ కర్నూల్(D) కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని TGSPDCL CMD వెల్లడించారు. కొండారెడ్డిపల్లిలో సర్వే చేశామని, త్వరలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్లు పంపిణీ చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ప్రతి పల్లెలో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు.

Similar News

News July 4, 2025

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు: వాతావరణ కేంద్రం

image

తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

News July 4, 2025

పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు: రేవంత్

image

TG: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం అని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేశాం. ఎవరూ పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు. వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. కష్టపడి మళ్లీ INCని అధికారంలోకి తేవాలి’ అని TPCC కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు.

News July 4, 2025

పొంగులేటి పేపర్ యాడ్‌పై కాంగ్రెస్‌లో చర్చ

image

TG: మల్లిఖార్జున ఖర్గే పర్యటనపై మంత్రి పొంగులేటి ఇచ్చిన పేపర్ ప్రకటనలతో ఆ పార్టీలో కొత్త కలకలం రేగింది. పలు పేపర్లకు రెవెన్యూ మంత్రి ఇచ్చిన యాడ్లలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫొటో లేదు. ఇటీవల ఆయనను మీనాక్షి మందలించినట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఫొటో లేకపోవడానికి కారణమదే అయ్యుండొచ్చని వినిపిస్తోంది. ఇదే సమయంలో మరో మంత్రి వివేక్ యాడ్లలో పార్టీ ఇన్‌ఛార్జ్ ఫొటో ఉంది(Slide:2).