News September 23, 2024
వేతన సవరణకు మరికొంత సమయం?
TG: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణ సిఫార్సులకై ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈ కమిటీ ఇంకా ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఆపై ఫిట్‌మెంట్, ఇతర అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పూర్తి నివేదిక సిద్ధం చేస్తుంది. దీని కోసం కమిటీ గడువును మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 11, 2024
జేసీ ప్రభాకర్‌తో నాకు ప్రాణహాని: కేతిరెడ్డి
AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ‘2006లో మా అన్న సూర్యప్రతాప్‌ను చంపారు. నన్నూ అలాగే హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎస్పీ జగదీశ్ సహకరిస్తున్నారు. ప్రస్తుతం నాపై మూడు మర్డర్ కేసులు నమోదు చేశారు. నియోజకవర్గంలో జేసీ ముఠా ఆగడాలు ఎక్కువయ్యాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News October 11, 2024
ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ ఇదే: ఏకంగా కి.మీపైనే!
సౌదీలోని జెడ్డాలో ‘జెడ్డా ఎకనమిక్ టవర్స్’ పేరుతో 1,007 మీటర్ల ఎత్తైన భవనం నిర్మిస్తున్నారు. ఇందులో 157 అంతస్తులు, 59 లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. లగ్జరీ అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆఫీసులు నిర్మిస్తున్నారు. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ఈఫిల్ టవర్, లోఖండ్‌వాలా మినర్వాకు 3 రెట్లు, అంపైర్ స్టేట్ బిల్డింగ్‌కు రెట్టింపు ఎత్తు ఉండనుంది. గతంలో పనులు ఆగిపోగా మళ్లీ ప్రారంభమయ్యాయి.
News October 11, 2024
పాకిస్థాన్ సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్!
సొంత గడ్డపై వరుసగా మ్యాచులు ఓడిపోతుండటంతో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ బోర్డులోకి మాజీ అంపైర్ అలీమ్ దార్‌ను పీసీబీ చేర్చుకున్నట్లు సమాచారం. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా నియమించినట్లు తెలుస్తోంది. అఖీబ్ జావెద్, అసద్ షఫీఖ్, అజహర్ అలీ, హసన్ చీమాలను తీసుకున్నట్లు టాక్. కాగా అలీమ్ దార్ ఇటీవల అంపైరింగ్‌కు వీడ్కోలు పలికారు.