News October 3, 2024
వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు: చిరంజీవి

TG: సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News October 16, 2025
ట్రాఫిక్లోనే జీవితం అయిపోతోంది!

ఒకప్పుడు ఆశలు, అవకాశాలకు కేంద్రంగా ఉన్న ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ బెంగళూరు ఇప్పుడు కళ తప్పుతోంది. భారీ ట్రాఫిక్ జామ్స్, మౌలిక సదుపాయాలు క్షీణించడం, ఖర్చులు పెరగడం నగర జీవితాన్ని దుర్భరం చేశాయి. ఇక్కడి ప్రజల జీవితంలో ఏడాదికి సగటున 134 గంటలు ట్రాఫిక్లోనే గడిచిపోతోంది. దీంతో చాలామంది వివిధ నగరాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు HYDలోనూ పీక్ అవర్స్లో ట్రాఫిక్ పెరిగిపోయింది.
News October 16, 2025
ఎల్లుండి బంద్.. స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయా?

TG: బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు బీఆర్ఎస్, బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ నెల 18న బంద్ ప్రభావం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులపై కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా పలు విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగైతే స్కూళ్లు, కాలేజీలకు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం(దీపావళి) కలిపి మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి.
News October 16, 2025
సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో-9ను జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు కాగా జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.