News December 12, 2024

మగాడికి కాస్త ఊరట: ‘మనోవర్తి’కి సుప్రీంకోర్టు సూచనలు (1)

image

బెంగళూరు టెకీ, భార్యా బాధితుడు అతుల్ సుభాష్ సూసైడ్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. విడాకుల కేసుల్లో మనోవర్తిని నిర్ణయించేందుకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులూ అనుసరించాల్సిన సూచనలివే..
* భార్యాభర్తల ఆర్థిక, సామాజిక హోదా పరిశీలన
* భవిష్యత్తులో భార్య, పిల్లల అవసరాల పరిశీలన
* భార్యాభర్తలిద్దరి విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు పరిశీలన
==> <<14855954>>NEXT PART<<>>

Similar News

News January 17, 2025

VIRAL: అప్పట్లో రూ.18కే తులం బంగారం

image

మార్కెట్‌లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. నిత్యం రూ.వందల్లో పెరుగుతూ అప్పుడప్పుడూ తగ్గుతూ మధ్యతరగతి ప్రజలను ఊరిస్తుంటుంది. అసలు వందేళ్ల క్రితం పది గ్రాములు బంగారం ధర ఎంతుందో తెలుసా? 1925లో దీని ధర రూ.18.75 ఉండగా 2025లో రూ.80,620గా ఉంది. 1959లో తొలిసారి రూ.100 దాటి రూ.102.56కి 1980లో తొలిసారి వెయ్యి దాటి రూ.1330, 1985లో రూ.2130, 1996లో రూ.5160, 2007లో రూ.10,800 కాగా 2022లో రూ.52వేలకు చేరింది.

News January 17, 2025

రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల

image

TG: గ్రూప్-2 ‘కీ’ రేపటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో వస్తుందని టీజీపీఎస్సీ పేర్కొంది. ఈనెల 18 నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను తెలపొచ్చని వెల్లడించింది. కాగా డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్ష జరిగింది.

News January 17, 2025

సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు

image

దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.