News March 25, 2024
నా అకౌంట్లు ఎవరో హ్యాక్ చేశారు: సుప్రియా

బాలీవుడ్ నటి, బీజేపీ నేత కంగన రనౌత్‌పై కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన వివాదాస్పద <<12924073>>పోస్ట్<<>> వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్ట్‌పై సుప్రియా స్పందించారు. ఎవరో తన FB, ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్ చేసి, తప్పుడు పోస్టులు పెట్టారని ట్వీట్ చేశారు. తాను మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తానో సన్నిహితులకు తెలుసని పేర్కొన్నారు. తన పేరుతో ట్విటర్‌లో ఉన్న పేరడి అకౌంట్‌పై రిపోర్ట్ చేసినట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
జామపండు తింటే ఎన్నో లాభాలు!

మార్కెట్‌లో విరివిగా లభించే జామపండును పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు. ఇది నారింజ కంటే 4 రెట్లు అధికంగా విటమిన్ C అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కేవలం 60-70క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దేశీయ సూపర్ ఫ్రూట్ అయిన జామను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. share it
News December 9, 2025
ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

ఇటీవల తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని జకార్తాలో ఓ ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల తయారీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మొదలైన మంటలు వెంటనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారంతా సజీవదహనం అయ్యారు.
News December 9, 2025
మొదటి విడత ప్రచారానికి తెర

TG: పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫలితాలు వెలువడతాయి. మొదటి విడతలో 4,235 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 56,19,430 మంది ఓటు వేయనున్నారు. వీరి కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


