News March 10, 2025
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.
Similar News
News March 10, 2025
పంత్‌ను కాదని KL వైపు గౌతీ మొగ్గు.. ఎందుకంటే!

CT 2025లో రిషభ్ పంత్‌ను కాదని KL రాహుల్‌ను కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేల్లో పంత్ తన X ఫ్యాక్టర్ నిరూపించుకోలేదు. స్పిన్ పిచ్‌లపై అంతగా ప్రభావం చూపలేదు. పైగా దుబాయ్ వంటి పిచ్‌లపై బౌలర్లు పెట్టే పరీక్ష ఎదుర్కోవాలంటే ఓపిక, మెరుగైన షాట్ సెలక్షన్, పరిణతి అవసరం. అతడిది ఇంపల్సివ్ నేచర్. తన వికెట్ విలువ తెలుసుకోకుండా ఔటైపోతారు. అందుకే KLవైపు గౌతీ మొగ్గారు.
News March 10, 2025
50-30-20 రూల్ పాటిస్తున్నారా?

సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీతంలో 50% ఇంటి అవసరాలు, హెల్త్ కేర్, రవాణా, పర్సనల్ కేర్, నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు చేయాలి. మరో 30% షాపింగ్స్, ఔటింగ్స్ వంటి కోరికల కోసం ఉంచుకోండి. మిగతా 20శాతం మాత్రం పొదుపు చేయాలి. ప్రతి నెలా డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తు కోసం పెట్టుబడులు ప్రారంభించండి. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటేన్ చేయండి. SHARE IT
News March 10, 2025
క్రోమ్‌ను గూగుల్ అమ్మేయాల్సిందే: DOJ

క్రోమ్ బ్రౌజర్‌ను అమ్మేయాలని గూగుల్‌కు DOJ మరోసారి స్పష్టం చేసింది. కోర్టు గత ఏడాది ఆదేశించినట్టుగా ఆన్లైన్ సెర్చ్‌లో అక్రమ గుత్తాధిపత్యానికి తెరదించాలని వెల్లడించింది. ఏ సెర్చ్ ఇంజిన్‌ను ఎంచుకోవాలన్న హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేసింది. యాపిల్, మొజిల్లా సహా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ప్రీ ఇన్స్టాల్ ఒప్పందాలు చట్టవిరుద్ధమని తెలిపింది. 2021లో వీరికి గూగుల్ $26.3B ఇచ్చినట్టు ఆధారాలు దొరికాయి.