News August 12, 2024

ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ కొల్లగొట్టిన క్రికెటర్ కుమారుడు

image

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్‌స్టన్ బెంజిమన్ కుమారుడు రాయ్ బెంజిమన్ పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటారు. US తరఫున ఆయన 400 మీ.హర్డిల్స్‌, 4X400 మీ.రిలేలో స్వర్ణ పతకం సాధించారు. 400 మీ.హర్డిల్స్‌ను 46:46 సెకన్లలో పూర్తి చేశారు. అలాగే 4X400 మీ.రిలేను 2:54.43 నిమిషాల్లో ముగించారు. కాగా రాయ్ బెంజిమన్ 1997లో న్యూయార్క్‌లో జన్మించారు. ఆయన తండ్రి విన్‌స్టన్ విండీస్ తరఫున 21 టెస్టులు, 85 వన్డేలు ఆడారు.

Similar News

News September 10, 2024

టాప్ డైరెక్టర్లతో యంగ్‌టైగర్.. పిక్స్ వైరల్

image

టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, కొరటాల శివ, అయాన్ ముఖర్జీతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ ఇవాళ ముంబైలో విడుదల కానుండటంతో వీరందరూ అక్కడ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. కొరటాలతో ‘దేవర’, నీల్‌తో ‘NTR31’, అయాన్‌తో ‘వార్ 2’ సినిమాలు చేస్తున్నారు.

News September 10, 2024

భారత్ రానున్న జెలెన్‌స్కీ?

image

ఈ ఏడాది చివరి నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రాయబారి అలెగ్జాండర్ పోలిష్‌చుక్ తెలిపారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా జెలెన్‌స్కీని మోదీ ఆహ్వానించారని, అది జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తమ అధ్యక్షుడు కూడా ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

News September 10, 2024

సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది?

image

సముద్రాల్లోని నీరు సూర్యుడి వేడికి ఆవిరై మేఘాలుగా వర్షించి నదుల్లోకి చేరుతుంది. ఆ నది సముద్రంలోకి వచ్చే క్రమంలో అనేక ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఆయా ప్రాంతాల లవణాలను తనలో కలుపుకొంటూ సముద్రంలో చేరుతుంది. నీటి గాఢత తక్కువగా ఉండటంతో నదుల్లో నీరు ఉప్పగా అనిపించదు. కానీ సాగరాల్లో లవణాలు ఎటూ పోయే దారి ఉండదు. అటు సముద్రాల అడుగున భూమి పొరల నుంచి కూడా లవణాలు అందులో కలుస్తుండటంతో ఆ నీరు ఉప్పగా ఉంటుంది.