News March 16, 2024

పోటీలో ఆరుగురు మాజీ సీఎంల తనయులు

image

AP అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మాజీ CMల తనయులు పోటీలో ఉన్నారు. YSR తనయుడు జగన్ పులివెందుల నుంచి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ (TDP) డోన్ నుంచి, సీనియర్ NTR తనయుడు బాలకృష్ణ (TDP) హిందూపురం, చంద్రబాబు వారసుడు లోకేశ్ (TDP) మంగళగిరి, నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ (JSP) తెనాలి నుంచి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్ (YCP) వెంకటగిరి నుంచి పోటీలో ఉన్నారు.

Similar News

News December 11, 2025

రేగు పండ్లు తింటే ఎన్ని లాభాలో..

image

చలికాలంలో లభించే రేగు పండ్లను తరచూ తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడతాయని వెల్లడిస్తున్నారు. కడుపులో మంట, మలబద్దకం సమస్యలు, చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయంటున్నారు. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ పండ్లు క్యాన్సర్ కారకాలనూ నిరోధిస్తాయంటున్నారు. మీకు రేగు పండ్లు ఇష్టమా? కామెంట్ చేయండి.

News December 11, 2025

14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. 13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు.
వెబ్‌సైట్: https://examinationservices.nic.in/

News December 11, 2025

చలికాలం.. పశువులు, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈ సమయంలో కోళ్లు, పాడి పశువులకు శ్వాస సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువ. అందుకే కోళ్లు, పశువుల ప్రవర్తనను గమనించాలి. పోషకాలతో కూడిన మేత, దాణా, మంచి నీటిని వాటికి అందించాలి. అవసరమైన టీకాలు వేయించాలి. పశువుల కొట్టాలు, కోళ్ల ఫారమ్ చుట్టూ పరదాలు కట్టాలి. ఈ సమయంలో పాడి, కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.