News May 24, 2024
25ఏళ్ల తర్వాత కొత్త సారథి కోసం సోనీ వేట!

ఎంటర్‌టైన్మెంట్ దిగ్గజం సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా కొత్త సారథిని వెతికే పనిలో పడింది. CEO, ఎండీ NP సింగ్ తప్పుకోనున్నట్లు ప్రకటించడమే కారణం. తన నాయకత్వంలో 25ఏళ్లుగా సంస్థను విజయవంతంగా నడిపించిన ఈయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సోనీ అన్వేషిస్తోంది. 1999లో CFOగా బాధ్యతలు చేపట్టిన సింగ్.. కొంతకాలానికి COO బాధ్యతలు చేపట్టారు. 2014లో MD, CEO బాధ్యతలు అందుకుని సంస్థ వృద్ధికి విశేష కృషి చేశారు.
Similar News
News February 10, 2025
20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు

AP: PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
News February 10, 2025
కుంభమేళాలో 12 మంది జననం.. పేర్లు ఇవే

మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్‌లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని చెప్పారు. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్‌రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.
News February 10, 2025
రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ కన్నీళ్లే: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు కన్నీళ్లే మిగిలాయని BRS నేత హరీశ్ రావు అన్నారు. ధర్నా చౌక్ వద్ద RMP, PMPల ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ప్రజలు నమ్మడం లేదని రాహుల్ గాంధీతో బాండ్ పేపర్లు రాయించారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఒక్కటీ అమలు కావడం లేదు. 11 సార్లు ఢిల్లీ వెళ్లినా రేవంత్ సాధించిందేమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.