News July 21, 2024

‘సారీ డాడీ’.. కంటతడి పెట్టిస్తోన్న ఇంటర్ విద్యార్థిని సూసైడ్ నోట్

image

HYD: ఆర్కేపురం శ్రీచైతన్య కాలేజీలోని ఇంటర్ 2nd ఇయర్ విద్యార్థిని వేణుశ్రీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఫస్టియర్‌లో 440కి 432 మార్కులు సాధించిన వేణుశ్రీ రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. ‘ఐయామ్ సారీ డాడీ. నీ కూతురిగా ఉండే స్థానం కోల్పోయా. హెల్త్ కూడా అస్సలు బాగుండటం లేదు. నా ఫీజు కట్టేందుకు మీకు ప్రాబ్లమ్ అవుతోంది’ అని రాసింది.

Similar News

News February 15, 2025

పెళ్లి పీటలు ఎక్కిన ‘జాలి రెడ్డి’

image

‘పుష్ప’ సినిమాలో జాలి రెడ్డి పాత్రతో ఫేమస్ అయిన కన్నడ నటుడు ధనుంజయ ఓ ఇంటివాడవుతున్నారు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతను మైసూరులో రేపు ఉదయం వివాహం చేసుకోనున్నారు. ఇవాళ జరిగిన రిసెప్షన్‌కు డైరెక్టర్ సుకుమార్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నిన్న హల్దీ ఫంక్షన్ వైభవంగా జరిగింది. ఇతను కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలకు పాటలు కూడా రాశారు.

News February 15, 2025

అలాంటి కథలతో సినిమాలు తీయాలి: మంత్రి సత్యకుమార్

image

AP: సమాజానికి ఉపయోగపడేలా ఆదర్శవంతమైన సినిమాలు తీయాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. వీరప్పన్, పూలన్ దేవి లాంటి బందిపోట్లు, స్మగ్లర్ల జీవితకథలతో సినిమాలు తీయడమేంటని ప్రశ్నించారు. వీటితో చిన్నారులను స్మగ్లర్లుగా మార్చమని సందేశమిస్తున్నారా అని అన్నారు. జన్మించిన ఊరు కోసం, సమాజం కోసం మంచి చేసే వారి కథలు సినిమాలుగా తీయాలని సూచించారు.

News February 15, 2025

WPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ 164 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్ స్కివర్ బ్రంట్(80*) అదరగొట్టగా కెప్టెన్ హర్మన్ ప్రీత్(42) ఫర్వాలేదనిపించారు. యస్తికా(11) మినహా ఇతర ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్నాబెల్ 3, శిఖా పాండే 2, కాప్సే, మిన్నూ చెరో వికెట్ వికెట్ తీశారు. DELHI టార్గెట్ 165.

error: Content is protected !!