News November 14, 2024
‘సారీ అమ్మానాన్న.. చనిపోతున్నా’
HYD బాచుపల్లి శ్రీచైతన్య కాలేజీలో <<14606404>>ఆత్మహత్య<<>> చేసుకున్న జస్వంత్ గౌడ్ రాసిన సూసైడ్ నోట్ కన్నీరు తెప్పిస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోతున్నానని పేర్కొన్నాడు. ‘అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నా వల్లే అన్నీ కష్టాలు. మన ఫ్యామిలీ అంతా మన చావు కోరుకుంటున్నారు కదా. అవి నాతోనే ఎండ్ కావాలని ఈ పని చేస్తున్నా. నా ఆత్మ శాంతించాలంటే అమ్మ, చెల్లిని బాగా చూసుకో నాన్నా’ అని చావుకు కారణమైనవారి పేర్లు రాశాడు.
Similar News
News November 15, 2024
రంగులు మారే శివలింగం ఎక్కడుందంటే?
తమిళనాడు రాష్ట్రం అతిపురాతన ఆలయాలకు నిలయం. ఇక్కడ సైన్స్‌కు చిక్కని ఎన్నో రహస్యాలు, సంపదలున్న ఆలయాలున్నాయి. ఇందులో తిరునళ్లూరులో ఉండే శ్రీ పంచ వర్ణేశ్వరాలయం ఒకటి. ఇక్కడున్న శివలింగం ఒక్క రోజులోనే 5 రకాల రంగుల్లో మారుతుంటుంది. లింగాన్ని రాగి, పింక్, గోల్డెన్, ఆకుపచ్చ, అనౌన్ కలర్‌లో చూడొచ్చు. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే కైలాసగిరి ప్రదక్షిణం చేసినట్లేనట.
News November 15, 2024
మొదటిది ఎప్పటికీ ప్రత్యేకమే!
ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందాల్సిందే. అయితే, తొలి ఆధార్ కార్డును ఎవరికి ఇచ్చారో తెలుసా? 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రకు చెందిన రంజనా సోనావానే అనే మహిళకు ఇచ్చారు. దీంతో ఆమె చరిత్రలో తొలి ఆధార్ పొందిన వ్యక్తిగా నిలిచిపోయారు. కాగా, భారత తొలి ఫైవ్ స్టార్ హోటల్ ముంబై తాజ్ హోటల్. తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు తొలి ప్రైవేట్ ట్రైన్, ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ IIT రూర్కీ కావడం విశేషం.
News November 15, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 15, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:06
✒ సూర్యోదయం: ఉదయం 6:21
✒ దుహర్: మధ్యాహ్నం 12:01
✒ అసర్: సాయంత్రం 4:04
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:40
✒ ఇష: రాత్రి 6.55
>> నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.