News March 21, 2024
అయోధ్య రాముడిని దర్శించుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్

దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ వీలు చిక్కినప్పుడల్లా దైవ దర్శనానికి వెళ్తుంటారు. తాజాగా ఆయన అయోధ్య రామ మందిరానికి వెళ్లారు. భారత ప్లేయర్ రవి బిష్ణోయ్‌తో కలిసి బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో వీరిద్దరు లక్నో జట్టు తరఫున ఆడనున్నారు.
Similar News
News March 17, 2026
అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.
News March 17, 2026
విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.