News June 4, 2024
సౌత్ బ్యాటిల్: బీజేపీ 30 vs కాంగ్రెస్ 33
మొన్నటి వరకు బీజేపీ అంటే నార్త్ పార్టీ అనేవాళ్లు. ఇప్పుడది సౌత్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో మొత్తం 131 సీట్లున్నాయి. ఇక్కడ బీజేపీ 30, కాంగ్రెస్ 33 చోట్ల జెండా పాతాయి. TDP, YCP, DMK, ADMK, JSP, ఇతరులు కలిసి 68 సీట్లు సాధిస్తున్నారు. ఇక NDAకు 49, ఇండియాకు 76 వస్తున్నాయి. 2019లో కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ చెరో 29 సీట్లు గెలవగా ఇతరులు 72 కైవసం చేసుకున్నారు.
Similar News
News November 15, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 15, 2024
రంగులు మారే శివలింగం ఎక్కడుందంటే?
తమిళనాడు రాష్ట్రం అతిపురాతన ఆలయాలకు నిలయం. ఇక్కడ సైన్స్‌కు చిక్కని ఎన్నో రహస్యాలు, సంపదలున్న ఆలయాలున్నాయి. ఇందులో తిరునళ్లూరులో ఉండే శ్రీ పంచ వర్ణేశ్వరాలయం ఒకటి. ఇక్కడున్న శివలింగం ఒక్క రోజులోనే 5 రకాల రంగుల్లో మారుతుంటుంది. లింగాన్ని రాగి, పింక్, గోల్డెన్, ఆకుపచ్చ, అనౌన్ కలర్‌లో చూడొచ్చు. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే కైలాసగిరి ప్రదక్షిణం చేసినట్లేనట.
News November 15, 2024
మొదటిది ఎప్పటికీ ప్రత్యేకమే!
ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందాల్సిందే. అయితే, తొలి ఆధార్ కార్డును ఎవరికి ఇచ్చారో తెలుసా? 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రకు చెందిన రంజనా సోనావానే అనే మహిళకు ఇచ్చారు. దీంతో ఆమె చరిత్రలో తొలి ఆధార్ పొందిన వ్యక్తిగా నిలిచిపోయారు. కాగా, భారత తొలి ఫైవ్ స్టార్ హోటల్ ముంబై తాజ్ హోటల్. తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు తొలి ప్రైవేట్ ట్రైన్, ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ IIT రూర్కీ కావడం విశేషం.