News May 15, 2024

నైరుతి రుతుపవనాలపై IMD ప్రకటన

image

నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకనున్నట్లు IMD అంచనా వేసింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ తెలిపారు. మే 31 ముందస్తేం కాదని, సాధారణ తేదీనే అని చెప్పారు. కాగా జూన్, జులై మాసాలు భారత వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి. ఈ 2 నెలల్లో కురిసే వర్షాలపైనే రైతులు ఆధారపడతారు. ఈసారి సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే తెలిపింది.

Similar News

News January 11, 2025

ప్రభాస్ పెళ్లిపై చెర్రీ హింట్.. అమ్మాయిది ఎక్కడంటే?

image

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హీరో రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘అన్‌స్టాపబుల్’ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై చరణ్ స్పందిస్తూ పెళ్లి కూతురు ఎవరో చెప్పనప్పటికీ ఎక్కడివారో చెప్పారని టాక్. అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఉంటారని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో ఈ ఎపిసోడ్ రిలీజ్ కానుంది.

News January 11, 2025

పండగ హ్యాపీగా జరుపుకోండి ఫ్రెండ్స్!

image

చదువు, ఉద్యోగాలు, వ్యాపారం కోసం HYDలో స్థిరపడ్డ లక్షలాది మంది సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్నారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉండటంతో చాలా మంది కార్లు, బైకులపై వెళ్తున్నారు. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట జర్నీ చేయవద్దు. 80 కి.మీ వేగం దాటొద్దు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడొద్దు. కచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. మద్యం తాగి వాహనం నడపకూడదు.
*క్షేమంగా వెళ్లి లాభంగా రండి.

News January 11, 2025

నేను హిందీ నేర్చుకుంది అలానే: మోదీ

image

జెరోదా కో ఫౌండర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హిందీ సరిగ్గా రాదని ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని నిఖిల్ కామత్ అనగా, మోదీ తన మాతృభాష కూడా హిందీ కాదని అన్నారు. తన బాల్యంలో రైల్వే స్టేషన్‌లో చాయ్ చుట్టూ హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండేవారని.. వారితో మాట్లాడుతూ భాష నేర్చుకున్నానని మోదీ వ్యాఖ్యానించారు.