News August 28, 2024
T20I క్రికెట్‌లో స్పెయిన్ ప్రపంచ రికార్డు

ఫుట్‌బాల్‌లో మెరుపులు మెరిపించే స్పెయిన్ క్రికెట్‌లోనూ సత్తా చాటుతోంది. బడా జట్లకు సాధ్యంకాని రీతిలో అంతర్జాతీయ మెన్స్ T20 క్రికెట్‌లో వరుసగా అత్యధిక విజయాలు(14) సాధించి చరిత్ర సృష్టించింది. WC సబ్ రీజినల్ యూరప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్రీస్‌పై గెలుపుతో ఈ ఘనత సాధ్యమైంది. 2021లో బెర్ముడా, 2022లో మలేషియా వరుసగా 13 గెలుపులు, ICC ఫుల్ టైమ్ మెంబర్ టీమ్స్ అఫ్గాన్, ఇండియా వరుసగా 12 విజయాలు సాధించాయి.
Similar News
News April 17, 2026
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. గోల్డెన్ అవర్‌లో సహాయం చేసిన వారికి రాహవీర్ పథకం కింద రూ.25 వేలు బహుమతి అందిస్తామని చెప్పారు. 30 బ్లాక్ స్పాట్ల సరిదిద్దడంతో ప్రమాదాలు తగ్గాయని వివరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై ఏఐ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 17, 2026
తాత్కాలిక సీజ్‌ఫైర్‌లు మాకొద్దు: ఇరాన్

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10రోజుల సీజ్‌ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ నుంచి మొదలుకొని ఎర్రసముద్రం వరకు ఈ ఏరియాలో ఎలాంటి అశాంతి లేకుండా ఉండటమే తమకు కావాలని స్పష్టం చేసింది. తాత్కాలిక సీజ్‌ఫైర్‌లను ఒప్పుకోబోమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న హింస ఇక్కడితో శాశ్వతంగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ వెల్లడించారు.
News April 17, 2026
రాహుల్ గాంధీకి షాక్

రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాకిచ్చింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశించింది. కాగా రాహుల్‌కు బ్రిటీష్ పౌరసత్వం కూడా ఉందని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ 2024లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ పౌరసత్వం అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇది నిషేధం.


