News August 2, 2024

అసెంబ్లీ వీడియోలు మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ ఆగ్రహం

image

TG: అసెంబ్లీకి సంబంధించిన వీడియోలు మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ అయ్యారు. ఇలాంటివి క్రియేట్ చేసిన వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అటు సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం వెల్లడించారు.

Similar News

News November 7, 2025

అద్దెకు తాతా..బామ్మా..

image

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం అద్దెకు తాతయ్య, బామ్మ అనే సరికొత్త సర్వీసు ప్రారంభించింది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి కుటుంబంతో ఉండే అనుభూతినిస్తుంది. జపాన్‌లోని సిస్టం స్ఫూర్తితో ప్రారంభించామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

News November 7, 2025

న్యూక్లియర్ వెపన్ రేసు మొదలైందా?

image

అణ్వాయుధ పరీక్షలు చేస్తామన్న ట్రంప్ <<18207970>>ప్రకటన<<>> అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా, రష్యా, నార్త్ కొరియాలు మరోసారి న్యూక్లియర్ టెస్టులకు సిద్ధమవుతున్నాయి. ఇది క్రమంగా న్యూక్లియర్ వెపన్స్ రేసుకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా అణ్వాయుధ దేశాలైన UK, ఫ్రాన్స్, ఇండియా, పాక్ కూడా ఆ బాట పట్టొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 12K న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు అంచనా.

News November 7, 2025

జ్ఞానాన్ని అందించే గురువే విష్ణు దేవుడు

image

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిస్ఠాయ నమో నమః ||
ఈ శ్లోకం విష్ణు స్వరూపుడైన వేదవ్యాస మహర్షికి, జ్ఞానానికి నిలయమైన విష్ణుమూర్తికి నమస్కారాలు తెలియజేస్తుంది. మన జీవితంలో జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అందించే గురువును విష్ణువుగా భావించి, గౌరవించాలి. అంకితభావంతో చదివితేనే ఉన్నతమైన వివేకం లభిస్తుందని దీని సారాంశం.
<<-se>>#VISHNUSAHASRASASOURABHAM<<>>