News February 25, 2025
వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2వ రోజు ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిన్నటి YCP సభ్యుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే ఆందోళనకు దిగడం, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం సరికాదన్నారు. MLAలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి ఇవాళ అవకాశం ఉన్నా, ఇష్టారీతిన ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు.
Similar News
News March 16, 2025
రేపు ఉదయం 9.30 గంటలకు..

AP: రాష్ట్రంలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. విద్యార్థుల భవిష్యత్తుకు ఇవి ఎంతో కీలకం. వారు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలి. ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలి. ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలి. Way2News తరఫున రేపటి నుంచి పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ ALL THE BEST.
News March 16, 2025
ఈ నెల 18న ఢిల్లీకి చంద్రబాబు!

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని ఆయనను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
News March 16, 2025
గోద్రా అల్లర్లపై అది తప్పుడు ప్రచారం: మోదీ

గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.