News December 16, 2024
బీఆర్ఎస్ వాయిదా ప్రతిపాదనను తిరస్కరించిన స్పీకర్
TG: వికారాబాద్(D) లగచర్లలో ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన రైతులపై ప్రభుత్వ నిర్బంధ కాండ-పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం, రైతులను జైళ్లలో బంధించిన అంశంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానంపై చర్చను కోరింది. దీనిని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. దీంతో పాటు మూసీ పరీవాహకంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో అనుమానాలపై చర్చించాలన్న వాయిదా ప్రతిపాదనను సైతం తిరస్కరించారు. తర్వాత సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.
Similar News
News January 20, 2025
బాబా రామ్‌దేవ్‌పై అరెస్ట్ వారెంట్
బాబా రామ్ దేవ్, పతంజలి MD ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మందులు, వ్యాధుల నివారణపై దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
News January 20, 2025
షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. ఇద్దరు హీరోలకు గాయాలు
బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, జాకీ భగ్నానీ గాయపడ్డారు. ‘మేరే హస్బెండ్ కి బీవి’ మూవీ షూటింగ్ సందర్భంగా సెట్ పైకప్పు కూలింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు BN తివారీ అదృష్టవశాత్తు నటులకు తీవ్ర గాయాలు కాలేదని చెప్పారు. అయితే షూటింగ్‌ల సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News January 20, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL)లో 642 పోస్టులకు దరఖాస్తు గడువు FEB 16తో ముగియనుంది. ఇందులో జూ.మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులున్నాయి. టెన్త్, మూడేళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు. MTSకు 18-33ఏళ్లు, మిగతా పోస్టులకు 18-30Y వయసు ఉండాలి. జీతం MTSకు ₹16K-₹45K, జూ.మేనేజర్ ₹50K-₹1.60L, ఎగ్జిక్యూటివ్‌కు ₹30K-₹1.20L ఉంటుంది.
వెబ్‌సైట్: <