News July 5, 2024

అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పర్యటన

image

AP: అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మీడియా హాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. MLA, MLCల క్వార్టర్ల నిర్మాణాలు ఎప్పటిలోగా పూర్తి చేయగలరని సమీక్షలో CRDA అధికారులను ప్రశ్నించారు. అసెంబ్లీ భవనంలో లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం మీడియా పాయింట్ ఉన్న ఎనెక్సా భవనంలో లైబ్రరీ, కమిటీ ఛైర్మన్ల ఛాంబర్ల ఏర్పాటుపై అయ్యన్న సమాలోచనలు చేశారు.

Similar News

News November 6, 2025

రెండో రోజూ ఏసీబీ సోదాలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది. లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News November 6, 2025

రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.5వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని ‘ఫతి’ స్పష్టం చేసింది. మిగతా రూ.5వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలంది. అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని.. అందుకే బంద్‌కు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.

News November 6, 2025

ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

image

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.