News February 20, 2025
వచ్చే నెల 1-5 తేదీల మధ్యలో ప్రత్యేక అసెంబ్లీ?

TG: ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక అసెంబ్లీ సెషన్లను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై 3 బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు ఈ సెషన్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు ముసాయిదాల రూపకల్పనలో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ పని పూర్తి కాగానే మంత్రివర్గం వాటిపై చర్చించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Similar News
News March 22, 2025
డీలిమిటేషన్ అమలైతే మనల్ని ద్వితీయ శ్రేణి పౌరుల్లా చూస్తారు: CM రేవంత్

TG: డీలిమిటేషన్ విషయంలో BJPని అడ్డుకోవాలని CM రేవంత్ అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. ‘జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల స్వరం వినిపించదు. మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు. మనవద్దే అభివృద్ధి ఎక్కువ. అయినప్పటికీ నిధుల్లో వివక్ష చూపిస్తున్నారు. రూపాయి పన్ను కట్టే తెలంగాణకు 42 పైసలే ఇస్తున్నారు. కానీ బిహార్‌కు రూపాయికి రూ. ఆరు ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News March 22, 2025
ఆ రైతులకు పరిహారం చెల్లించాలి: బండి

TG: గత పదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఆదుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. మరోవైపు ప్రజల దృష్టి మరల్చేందుకు డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఫైరయ్యారు.
News March 22, 2025
ఫోన్ చూస్తూ తింటున్నారా.. జాగ్రత్త!

చాలామందికి తినే సమయంలోనూ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ప్లేటులో ఏముందో కూడా పట్టించుకోకుండా తినేవారు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తినే ప్రతి ముద్దను ఆస్వాదిస్తే అరుగుదల మెరుగ్గా ఉంటుంది. దృష్టి ఫోన్‌పై ఉంటే ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా మనకు తెలీదు. దీని వల్ల పోషకాహార లోపమో లేక ఊబకాయం రావడమో జరుగుతుంది. రెండూ ప్రమాదమే’ అని వివరిస్తున్నారు.