News March 18, 2024
భారత్-చైనా సరిహద్దులో జవాన్ల కోసం స్పెషల్ బంకర్స్
చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొట్టేందుకు వాస్తవాధీన రేఖ వద్ద గడ్డకట్టే చలిలోనూ మన జవాన్లు గస్తీ కాస్తుంటారు. అందుకే వారి కోసం కేంద్రం పెద్ద ప్రత్యేక బంకర్లను నిర్మిస్తోంది. సౌర విద్యుత్‌తో పనిచేసే ఈ బంకర్లు -30 డిగ్రీల్లోనూ 22 డిగ్రీల వెచ్చని వాతావరణం కల్పిస్తాయట. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా పలు చోట్ల ఏర్పాటైన ఈ బంకర్లను ఇప్పుడు ప్రభుత్వం ఆధునీకరించి మరిన్ని చోట్లకు విస్తరిస్తోంది.
Similar News
News September 19, 2024
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్లు ఎన్నంటే?
సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో రైల్వే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరి 11, 12, 13 తేదీల్లో రెగ్యులర్ రైళ్ల టికెట్లన్నీ అమ్ముడవ్వగా వెయిటింగ్ లిస్ట్ కూడా పెరిగిపోయింది. ఈ వెయిటింగ్ లిస్ట్‌ను ఫిల్ చేసేందుకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రద్దీని బట్టి పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్లు నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
News September 19, 2024
జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన CPI(M)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నిక(ఒకే దేశం. ఒకే ఎన్నిక)ను వ్యతిరేకిస్తున్నట్లు CPI(M) ప్రకటించింది. ఇది BJP-RSS ఆలోచన అని ఆరోపించింది. ఈ జమిలి ఎన్నిక అమలైతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బ తింటుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని, ఫలితంగా ప్రజల ఓటు హక్కుకు విలువలేకుండా పోతుందని పేర్కొంది. కేంద్రం ఈ జమిలి ఎన్నికలకు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News September 19, 2024
ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరు హీరోయిన్లు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మధురైలో ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రభాస్ లేని సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా ఇప్పటికే ఫిక్స్ కాగా సెకండ్ హీరోయిన్ కూడా ఉందని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.