News November 10, 2024

చలికాలంలో అయోధ్య రాముడికి ప్రత్యేక దుస్తులు

image

చలికాలం దృష్ట్యా అయోధ్యలోని రామ్ లల్లాను వెచ్చని దుస్తులతో కప్పి ఉంచాలని ఆలయ నిర్వాహకులు భావించారు. ప్రత్యేక శాలువాలు, ఉన్ని దుస్తులతో ఆయనను అలంకరించాలని నిర్ణయించారు. వీటిని ఢిల్లీకి చెందిన ఓ డిజైనర్ రూపొందిస్తున్నారు. అలాగే వాతావరణంలో మార్పుల వల్ల ఆయనకు నివేదించే ప్రసాదంలోనూ మార్పులు చేస్తున్నారు. బాలరాముడికి డ్రై ఫ్రూట్స్, పూరీ, హల్వాను నివేదిస్తారు.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: లైసెన్స్ గన్స్‌ను PSలో ఇవ్వాలి: సీపీ

image

స్థానిక సంస్థల సాధారణ (గ్రామపంచాయతీ )ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వ్యక్తులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో 29లోపు డిపాజిట్ చేయాలని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకొవచ్చని సూచించారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు.

News November 28, 2025

డిసెంబర్ 1న గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం

image

కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జిని డిసెంబర్ 1న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ‌రూ.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని పొడవు 55 మీటర్లు. ఒకే సమయంలో 100 మంది బరువును ఈ గ్లాస్ బ్రిడ్జి మోయగలదు. అయితే ముందు జాగ్రత్తగా 40 మంది చొప్పున బ్యాచ్‌లను అనుమతించనున్నారు. విశాఖకు పర్యాటకులు ఎక్కువమంది వచ్చే సీజన్ కావడంతో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

News November 28, 2025

VKB: టీఈ పోల్ యాప్‌ను వినియోగించుకోండి: కలెక్టర్

image

టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కావాలసిన సమాచారాన్ని పొందవచ్చునని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలను మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ ను పొందవచ్చునని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదును కూడా యాప్ ద్వారా తెలియచేయవచ్చునని తెలిపారు.