News November 11, 2024
స్పెషల్ డే: 11/11/11న 11.11కు 111 రన్స్ ఛేజ్

క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టం 13 ఏళ్ల కిందట ఇదే తేదీన చోటు చేసుకుంది. 11/11/11న(నవంబర్ 11, 2011) ఆస్ట్రేలియాతో టెస్టులో విజయం కోసం సౌతాఫ్రికా 11 గంటల 11 నిమిషాలకు 111 పరుగులు చేయాల్సి వచ్చింది. స్కోర్ బోర్డుపై ఈ అంకెలు కనపడగానే గ్రౌండులో, టీవీల్లో చూస్తున్నవారు ఎగ్జైట్‌మెంట్‌కు గురయ్యారు. ఆ టెస్టులో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలిచింది.
స్కోర్లు: ఆసీస్ 284&47, సౌతాఫ్రికా 96&236/2
Similar News
News March 6, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్‌పై షాకింగ్ ఆరోపణలు

ఎప్‌స్టీన్ కేసులో అదృశ్యమైన 16 పేజీల డాక్యుమెంట్లను US DOJ తాజాగా బయటపెట్టింది. ఇందులో 1983లో ఒక మైనర్ బాలికపై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో తాను అడ్డుచెప్పగా ట్రంప్ తనను కొట్టి అక్కడి నుంచి పంపేశారని ఆ మహిళ FBI విచారణలో పేర్కొంది. ఈ రికార్డులను ఇన్నాళ్లూ ఎందుకు దాచారనే అంశం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కాగా ట్రంప్ ఈ ఆరోపణలను ఖండించారు.
News March 6, 2026
ముంబై న్యూ జెర్సీలో హిట్‌మ్యాన్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL-2026కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఫుల్ ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్.. ప్రత్యర్థులపై ఎలా చెలరేగుతారో చూడాలి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని క్రీడావర్గాలు వెల్లడించాయి.
News March 6, 2026
అభిషేక్ మాదిరే వరుణ్‌ను ఎందుకు సపోర్ట్ చేయరు: సెహ్వాగ్

నిన్న ENGతో మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటిపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సరిగ్గా ఆడట్లేదు. అతడిని వెనకేసుకొస్తున్న వారికి బౌలర్‌కు సపోర్ట్ చేయడానికి ఎందుకు సమస్య? 3 మ్యాచ్‌లలో రన్స్ ఇవ్వగానే వేరే బౌలర్ కోసం చూస్తున్నామని చెబుతారు. ఆ కొత్త ప్లేయర్ రాణిస్తాడనే గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నించారు.


