News April 14, 2024
మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు: పవన్ కళ్యాణ్
AP: ప్రతి వ్యక్తిలో ఏ నైపుణ్యం, శక్తి ఉందో గుర్తించాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘కులగణన మాత్రమే కాదు.. ప్రతిభా గణన కూడా జరగాలి. ప్రతిభను గణించి మహిళలకు అవకాశాలు కల్పించాలి. పశ్చిమగోదావరి నుంచి విదేశాలకు షూ లేసులు ఎగుమతి అవుతున్నాయి. ఈ స్థాయిలో ప్రతి మహిళా ఏదో ఒక నైపుణ్యం పెంచుకోవాలి. ప్రతి గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు ఏర్పాటుచేస్తాం’ అని హామీ ఇచ్చారు.
Similar News
News November 17, 2024
తండ్రి మృతి.. నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్
తన తండ్రి రామ్మూర్తినాయుడు మృతిచెందడంపై సినీ హీరో నారా రోహిత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నాన్న మీరొక ఫైటర్. మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రజలను ప్రేమించడం, మంచి కోసం పోరాడటం నేర్పారు. మీతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జీవితమంతా గుర్తుంచుకుంటాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. బై నాన్న’ అని ట్వీట్ చేశారు.
News November 17, 2024
లగచర్ల ఘటనలో రిమాండ్‌కు మరో నలుగురు.. కలెక్టర్‌కు భద్రత పెంపు
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటివరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా, కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
News November 17, 2024
నేడు రామ్మూర్తి అంత్యక్రియలు.. హాజరుకానున్న చంద్రబాబు
AP: మాజీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు ఇవాళ తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేశ్, నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుండెసంబంధ సమస్యలతో చికిత్స పొందుతూ రామ్మూర్తి నిన్న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.