News August 21, 2024
‘RRR’ భూసేకరణ పనుల్లో వేగం పెంచాలి: CM
TG: రీజినల్ రింగ్ రోడ్(RRR) దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ORR, RRR మధ్య అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ మార్గాలుండాలన్నారు. RRR విషయంలో ఏదైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం చెప్పారు.
Similar News
News September 19, 2024
మీ ఇంట్లో ఫ్రిజ్ శుభ్రం చేయకపోతే మహిళల్లో ఈ సమస్యలు!
మహిళల్లో యూరినరీ సమస్యలు (UTI) ఇంట్లోని ఫ్రిజ్ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉందని US అధ్యయనం అంచనా వేసింది. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎస్చెరిచియా కోలై (E-Coli) అనే బ్యాక్టీరియా ఏర్పడి అది ఇతర పదార్థాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో UTI సమస్యలు వస్తున్నట్టు అంచనా వేసింది. ఇంట్లోని ఫ్రిజ్‌ను తరచుగా శుభ్రం చేయడం మహిళల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News September 19, 2024
ఫోలిక్ యాసిడ్ కోసం ఏ వంటలు మంచివంటే..
ఫోలిక్ యాసిడ్ మన శరీరానికి చాలా కీలకం. ప్రధానంగా గర్భిణుల్లో ఇది అత్యవసరం. కొన్ని వంటకాల్లో సహజంగా ఫోలిక్ యాసిడ్‌ను సహజంగా పొందవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవి: పాలకూర, పన్నీర్, శనగలు, సాంబారు, రాజ్మా, మెంతికూర. వీటిలో సహజంగా ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లు లభిస్తాయని వివరిస్తున్నారు. అయితే, గర్భిణులు ముందుగా వైద్యుల సలహాను తీసుకున్న తర్వాత వీటిని తినాలని సూచిస్తున్నారు.
News September 19, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అటు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.