News November 1, 2024

తిప్పేసిన స్పిన్నర్లు.. కివీస్ 235 ఆలౌట్

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా, సుందర్ స్పిన్ మ్యాజిక్‌తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆ జట్టులో విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) అర్ధ సెంచరీలతో రాణించారు. జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ ఒక వికెట్ తీశారు.

Similar News

News December 14, 2024

ICUలో అద్వానీ: లేటెస్ట్ హెల్త్ అప్డేట్

image

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని LK అద్వానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఢిల్లీ అపోలో ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. నిజానికి రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రికి వచ్చారని తెలిసింది. శనివారం మాత్రం ICUలో అడ్మిట్ చేశారు. సీనియర్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరీ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 97ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

News December 14, 2024

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.980 తగ్గి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.900 తగ్గి రూ.71,400గా ఉంది. మరోవైపు సిల్వర్ ధర కూడా కేజీపై రూ.వెయ్యి తగ్గింది. దీంతో ప్రస్తుతం లక్ష రూపాయలుగా ఉంది.

News December 14, 2024

నమ్మకంతో పరీక్ష రాయండి.. గ్రూప్-2 అభ్యర్థులకు వెంకటేశం సూచన

image

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకం ఉంచి గ్రూప్-2 అభ్యర్థులు పరీక్షలు రాయాలని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం సూచించారు. రేపు, ఎల్లుండి జరిగే ఎగ్జామ్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరి ఓఎంఆర్ షీట్ వారికే ఉంటుందని, అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత వేగంగా ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.