News August 3, 2024
SPIRITUAL: శ్రీవైష్ణవ దివ్యక్షేత్ర వైభవం ‘శ్రీరంగం’
108 శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల్లో భవ్యమైనది తమిళనాడులోని శ్రీరంగం. విష్ణువు రంగనాథుడిగా ఇక్కడ కొలువున్నారు. శ్రీరామానుజులవారు ఎన్నో ఏళ్లు ఈ స్వామి సేవలో తరించారు. రాములవారు ఇచ్చిన రంగనాథ విగ్రహంతో లంకకు వెళ్తూ విభీషణుడు ఇక్కడ విశ్రాంతికి ఆగారట. బయలుదేరే సమయంలో మూర్తి ఎంతకూ కదలకపోవడంతో ఇక ఇక్కడే ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం. ఢిల్లీ సుల్తాన్ కుమార్తె స్వామిపై భక్తితో ఆయనలో ఐక్యమైందని చెబుతారు.
Similar News
News September 12, 2024
ఎర్రమట్టి దిబ్బలపై విచారణకు ఆదేశం
AP: విశాఖ జిల్లా భీమిలి మండలంలోని ఎర్రమట్టి దిబ్బలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్ 118/5Aలో 250 ఎకరాలకు పైగా భూములను ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. అయితే ఆ భూములన్నీ వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశించింది.
News September 12, 2024
సీతారాం ఏచూరి మృతిపై ప్రధాని మోదీ సంతాపం
సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలకు ఆయనో దిక్సూచిలా వ్యవహరించారని, రాజకీయాలకు అతీతంగా అందరితో అనుబంధం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. ఏచూరి కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక దేశ రాజకీయాలకు ఏచూరి మృతి తీరని లోటని కేరళ సీఎం పినరయి విజయన్, ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు.
News September 12, 2024
మనుషుల నుంచీ కాంతి వెలువడుతోంది!
మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్రా-సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి, మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బంధించారు.