News February 6, 2025
స్పాండిలైటిస్ నివారణ మార్గాలివే

✒ డాక్టర్ల సూచన మేరకు వ్యాయామాలు చేయాలి. ఔషధాలు తీసుకోవాలి. జీవన విధానాన్ని మార్చుకోవాలి.
✒ కూర్చునే, పడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
✒ ఆహారంలో క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్లు పుష్కలంగా ఉండాలి.
✒ ఒమేగా-3 సప్లిమెంట్లు ఉండే అవిసె గింజలు, వాల్‌నట్స్, చేపలు, తాజా పండ్లు, కూరగాయాలు, పాలు, చీజ్, సోయా, మీల్‌మేకర్ తినాలి.
✒ మద్యపానానికి దూరంగా ఉండాలి.
Similar News
News March 27, 2025
భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేడు రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హిరానగర్ సెక్టార్లో ఆదివారం నాటి యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్‌లో తప్పించుకున్న ముష్కరులనే నేడు చంపేశారని సమాచారం. నాలుగు రోజులుగా ఇక్కడ టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది.
News March 27, 2025
పెరగనున్న మెడిసిన్స్ ధరలు

ఔషధాల ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డ్రగ్స్ కంట్రోల్ సిద్ధమవుతోంది. దేశంలో అత్యధిక మంది వాడే షుగర్ మాత్రలతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలు తదితర మెడిసిన్స్ రేట్లు ప్రియం కానున్నాయి. వీటి ధరలు 1.7శాతం పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. మరో 2,3 నెలల్లో కొత్త రేట్లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
News March 27, 2025
షాకింగ్: అరణ్యంలో చిన్నారి మావోయిస్టులు!

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో బాల మావోయిస్టులను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన సారయ్య వద్ద లభ్యమైన లేఖలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. గెరిల్లా యుద్ధం కోసం 130 మంది బాల బాలికలను రిక్రూట్ చేసుకున్నారు. 9 నుంచి 11 ఏళ్ల చిన్నారులు 40 మంది, 14 నుంచి 17 ఏళ్లలోపు వారు 40 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి స్నైపర్ గన్స్, IED, ఫైటింగ్, అటాకింగ్ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నారు.