News February 23, 2025
SRD: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
Similar News
News February 23, 2025
కాంగ్రెస్‌కు శశి థరూర్ రాం రాం చెబుతారా?

శశి థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల థరూర్.. మోదీ అమెరికా పర్యటన, కేరళలో పినరయి ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించారు. కేరళలో ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం కావాలని, లేదంటే మరోసారి విపక్ష స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అవసరం లేదనుకుంటే తనకు ‘ఆప్షన్లు’ ఉన్నాయని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.
News February 23, 2025
మేడ్చల్: అవుషాపూర్ VBIT కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఘట్‌కేసర్ పీఎస్ పరిధి అవుషాపూర్ వీబీఐటీ కళాశాల సమీపంలో యాష్ లోడ్ లారీ యాక్టివా నడుపుతున్న యశ్వంత్(18) అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలం జమీల్‌పేటకు చెందిన యశ్వంత్, జమీల్‌పేట నుంచి బీబీ నగర్ వైపు వెళ్తుండగా వీబీఐటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 23, 2025
ఉమామహేశ్వరాలయానికి రూ.55.25 లక్షలు మంజూరు

గూడూరు మండలంలోని కంకటావ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర వెంకటాచల వేణుగోపాల స్వామి దేవస్థానం పునరుద్ధరణకు రూ.55.25 లక్షలు మంజూరయ్యాయి. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అభ్యర్థన మేరకు దేవదాయ శాఖ ఈ నిధులను మంజూరు చేసినట్లు పలువురు పేర్కొన్నారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆదేశాలను జారీ చేయడంతో గ్రామస్థులు, పెద్దలు వారికి ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.