News February 1, 2025

SRD: గురుకుల ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ప్రభుత్వంలో వివిధ గురుకులాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గాను ఈనెల  6 వరకు గడువు పొడిగించినట్లు TGSWREIS అధికారులు శనివారం తెలిపారు. గురుకులాల్లో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలలో ప్రవేశం కోసం ఫిబ్రవరి 1 చివరి తేదీగా ఉండగా మరో 5 రోజులు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News March 14, 2025

గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.

News March 14, 2025

బాచుపల్లి: కాలుష్యంపై రేపు నిరసన

image

పరిశ్రమల ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు నిరసన తెలియచేయనున్నట్లు 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మీ సుబ్బారావు తెలిపారు. సనత్‌నగర్‌లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో రేపు ఉదయం 11 గం.లకు అధికారులకు వినతిపత్రం అందచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

News March 14, 2025

రేగొండ: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి(52) డీబీఎం-38 కెనాల్ మోటార్ పైపు కింద చెత్తను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరణ జరిగి రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.

error: Content is protected !!