News March 24, 2025

SRD: నేటి నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

image

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తులను నేటి నుంచి స్వీకరించనున్నట్లు డీఈవో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని, మే 15వ తేదీ వరకు ఇంటర్‌ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 25వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

News March 26, 2025

సూసైడ్‌ చేసుకుంటానని భర్తను బెదిరించడం క్రూరత్వమే: హైకోర్టు

image

సూసైడ్ చేసుకుంటానంటూ భర్తను, అతడి కుటుంబాన్ని భార్య బెదిరించడం క్రూరత్వం కిందికే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భార్య అలా చేస్తే భర్త విడాకులు తీసుకోవడంలో తప్పేం లేదని తేల్చిచెప్పింది. భార్య సూసైడ్ పేరిట తమ కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త దిగువ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. కోర్టు మంజూరు చేయగా భార్య హైకోర్టుకెళ్లారు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.

News March 26, 2025

KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

error: Content is protected !!