News May 23, 2024

SRHకు చెపాక్ భయం.. రేపు గెలుస్తుందా?

image

IPLలో రేపు కీలక పోరు జరగనుంది. ఫైనల్‌కు అర్హత సాధించేందుకు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అయితే క్వాలిఫయర్-2 జరిగే చెన్నై చెపాక్ స్టేడియంలో SRHకు చెత్త రికార్డు ఉంది. అక్కడ సన్‌రైజర్స్ 10 మ్యాచులు ఆడగా ఎనిమిదింటిలో ఓడింది. ఒక మ్యాచ్ గెలవగా, మరో మ్యాచ్ టై అయింది. మరి ఈ సెంటిమెంట్‌ను కమిన్స్ సేన బ్రేక్ చేసి, విజయం సాధిస్తుందేమో చూడాలి.
**ALL THE BEST SRH

Similar News

News April 16, 2026

27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

శాశ్వత ప్రాతిపదికన 27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి పంజాబ్‌ & సింధ్‌ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.64,820-93,960గా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 5-5-26. పూర్తి వివరాలకు www.punjabandsind.bank.in చూడండి.

News April 16, 2026

అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

image

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్‌కు చెందిన లోన్ అకౌంట్లను బ్యాంకులు ఫ్రాడ్‌గా పేర్కొని దర్యాప్తు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ వేసిన పిటిషన్‌ను SC కొట్టివేసింది. ఈ దశలో స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. తొలుత బాంబే HC సింగిల్ బెంచ్ అంబానీకి ఫేవర్‌‌గా తీర్పునిచ్చింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, IDBI పిటిషన్‌ను విచారించిన డివిజన్ బెంచ్‌ దీనిని పక్కన పెట్టింది.

News April 16, 2026

మార్కెట్ షేర్‌లో మారుతీ రివర్స్ గేర్

image

2026 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ మార్కెట్ షేర్ 39.26%కి పడిపోయింది. 13 ఏళ్లలో ఇదే కనిష్ఠం. ఒకప్పుడు సగానికి పైగా మార్కెట్‌ను ఏలిన మారుతీ.. పెరుగుతున్న పోటీ, కస్టమర్ల అభిరుచులు మారడంతో వరుసగా మూడో ఏడాదీ వెనకబడింది. 2020 నుంచి చూస్తే కంపెనీ ఏకంగా 12% మార్కెట్ షేర్‌ను కోల్పోయిందని SIAM గణాంకాలు చెబుతున్నాయి. ఇతర కంపెనీల SUVs హవా పెరగడమే మారుతీకి నెగటివ్‌గా మారినట్లు స్పష్టమవుతోంది.