News May 24, 2024
టాస్ ఓడిన SRH.. ఫైనల్ జట్లు ఇవే

SRHతో జరుగుతున్న క్వాలిఫయర్-2లో రాజస్థాన్ టాస్ గెలిచింది. కెప్టెన్ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నారు.
SRH: హెడ్, అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, సమద్, కమిన్స్(C), భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్.
RR: కాడ్మోర్, జైస్వాల్, సంజూ శాంసన్(C), రియాన్, జురెల్, పావెల్, అశ్విన్, చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్.
Similar News
News February 15, 2025
సోమనాథ్ క్షేత్రం ప్రత్యేకతలు మీకు తెలుసా… !

ద్వాదశ జ్యోతిర్లింగాలలో గుజరాత్‌లో ఉండే సోమనాథ్ క్షేత్రం మెుదటిది. చంద్రునికి శాపవిముక్తి కలిగించిన ప్రదేశం కాబట్టి దీనికి సోమనాథ క్షేత్రంగా పేరొచ్చిందని ప్రతీతి. చంద్రుడు ఈక్షేత్రాన్ని బంగారంతో నిర్మించగా, రావణాసురుడు వెండితో, శ్రీ కృష్ణుడు చందనపు చెక్కలతో నిర్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. గజనీ మహమ్మద్ సహా అనేక మంది దాడి చేసి సంపద దోచుకెళ్లగా 1951లో పునర్నిర్మించి ప్రారంభించారు.
News February 15, 2025
‘విశ్వంభర’లో మెగా హీరో?

చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ మూవీలో మెగా హీరో సాయి దుర్గతేజ్ అతిథి పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ షూట్‌లో ఆయన పాల్గొన్నారని తెలిపాయి. మరోవైపు చిరు ఇంట్రో సాంగ్ షూట్ జరుగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. దీంతో ఆయన సాంగ్‌లో కనిపిస్తారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు చిరంజీవి సినిమాలోని సాంగ్స్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.
News February 15, 2025
ఎంతో చేయాలని ఉంది.. కానీ గల్లా పెట్టె సహకరించట్లేదు: సీఎం

AP: అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంపద పెరగలేదని, రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఇంకా ఎంతో చేయాలని ఉందని, కానీ గల్లా పెట్టె సహకరించడం లేదన్నారు.