News March 28, 2024

SRH ప్లేయర్ సరికొత్త రికార్డు

image

IPLలో అత్యధిక జట్లకు ఆడిన భారత ఆటగాడిగా SRH బౌలర్ జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో మనీశ్ పాండే 7 జట్లకు ప్రాతినిధ్యం వహించగా, జయదేవ్ 8 టీమ్స్(KKR, DC, RCB, పుణె, RR, MI, LSG, SRH) తరఫున ఆడారు. అలాగే IPLలో రెండు అత్యధిక స్కోర్లు చేసిన జట్లలో భాగస్వామిగా ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచారు. ఆరోన్ ఫించ్ అత్యధికంగా 9 జట్ల(RR, DC, పుణె, SRH, MI, గుజరాత్ లయన్స్, పంజాబ్, RCB, KKR)కు ఆడారు.

Similar News

News November 24, 2025

కొడంగల్: ‘CM TOUR’ షెడ్యూల్ విడుదల

image

సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారంలో పాల్గొని
మధ్యాహ్నం 2.40గంలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కొడంగల్‌కు బయలుదేరుతారు. 3.55 గంటల నుంచి 4.55 వరకు అక్షయపాత్ర గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భూమి పూజ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5గం. హైదరాబాద్ బయలుదేరుతారు.

News November 24, 2025

32,438 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

RRB గ్రూప్-D పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <>https://www.rrbcdg.gov.in/<<>>లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 32,438 పోస్టులకు ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

News November 24, 2025

ఈ డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ!

image

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ హోల్డర్లకే వచ్చే ఏడాది ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్టు-2026 వెల్లడించింది. వారిలో ఎంప్లాయిబిలిటీ రేటు 80%గా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో IT(78%), B.E/B.Tech(70%), MBA(72.76%), కామర్స్(62.81%), నాన్ IT సైన్స్(61%), ఆర్ట్స్(55.55%), ITI-ఒకేషనల్(45.95%), పాలిటెక్నిక్(32.92%) ఉన్నట్లు అంచనా వేసింది. డిగ్రీతోపాటు స్కిల్స్ ముఖ్యమని పేర్కొంది.