News May 7, 2025

చెపాక్‌లో చెన్నైకి చెక్ పెట్టిన SRH

image

చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి SRH అదరగొట్టింది. చెపాక్ స్టేడియంలో CSKపై తొలిసారి గెలిచింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 0, హెడ్ 19, ఇషాన్ 44, క్లాసెన్ 7, అనికేత్ 19, కమిందు 32*, నితీశ్ 19* రన్స్ చేశారు. నూర్ అహ్మద్ 2, ఖలీల్, కాంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను ఆరెంజ్ ఆర్మీ సజీవంగా ఉంచుకోగా, చెన్నై దాదాపుగా ఔటైంది.

Similar News

News August 10, 2025

పోలింగ్ సెంటర్ల మార్పు.. వ్యూహంలో భాగమేనా?

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న TDP, YCP గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించాయి. అయితే తమకు మద్దతిచ్చే ఎర్రబల్లి, నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డి‌పల్లి ఓటర్ల పోలింగ్ సెంటర్లను 2-4KM దూరానికి మార్చారని జగన్‌తో సహా YCP నేతలు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామాల ఓటర్లే తమ గెలుపునకు కీలకం కానున్నారని, వారిని ఓటింగ్‌కు దూరం చేయాలనే దుర్బుద్ధితోనే TDP ఇలా చేసిందని మండిపడుతున్నారు.

News August 10, 2025

రాబర్ట్ వాద్రా రూ.58 కోట్లు తీసుకున్నారు: ED

image

ఆర్థిక నేరం కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త <<16104501>>రాబర్ట్<<>> వాద్రాకు ఉచ్చు బిగుస్తోంది. అక్రమ ల్యాండ్ డీల్ వ్యవహారంలో ఆయనకు రూ.58 కోట్ల ముడుపులు అందినట్లు ఛార్జ్‌షీట్‌లో ED పేర్కొంది. స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.53 కోట్లు, బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.5 కోట్లు పొందారంది. ఈ డబ్బుతో ఆయన స్థిరాస్తుల కొనుగోళ్లతో పాటు పెట్టుబడులు పెట్టారని తెలిపింది.

News August 10, 2025

తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతాం: ఉత్తమ్

image

TG: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేవాదుల పంపుహౌస్ పరిశీలించిన ఆయన అక్కడి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైందని తెలిపారు. భూసేకరణ కోసం రూ.67 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. పెండింగ్ బిల్లులనూ త్వరలో మంజూరు చేస్తామన్నారు.