News October 16, 2024
SRH రిటెన్షన్స్: క్లాసన్‌కు రూ.23 కోట్లు?
IPL-2025 వేలానికి ముందు SRH రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టును ESPNcricinfo విడుదల చేసింది. క్లాసన్‌కు ₹23 కోట్లు, కమిన్స్‌కు ₹18కోట్లు, అభిషేక్ శర్మకు ₹14కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకోవాలని SRH నిర్ణయించిందని పేర్కొంది. హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని కూడా అంటిపెట్టుకోనుందని ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది. కాగా ప్లేయర్ల రిటెన్షన్స్‌ను ఫైనల్ చేసేందుకు ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు ఈనెల 31తో ముగియనుంది.
Similar News
News November 14, 2024
ఓలాకు షాక్.. రంగంలోకి BIS
Ola Electric నాణ్యతా, సర్వీసు ప్రమాణాల లోపం ఆరోపణలపై Bureau of Indian Standards విచారణ జరుపుతుందని వినియోగదారుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. యూజర్ల నుంచి 10 వేలకుపైగా ఫిర్యాదులు అందడంపై వివరణ ఇవ్వాల్సిందిగా CCPA గతంలో నోటీసులు ఇచ్చింది. అయితే అవి కేవలం సాఫ్ట్‌వేర్ వినియోగం అర్థంకాకపోవడం, లూస్ పార్ట్స్ సమస్యలని ఓలా పేర్కొంది. అయితే, దీనిపై విచారణ బాధ్యతను BISకు CCPA అప్పగించింది.
News November 14, 2024
సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్
TG: గురుకులాల్లో కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై CM రేవంత్ స్పందించారు. గురుకులాలకు నాసిరకం ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటివారు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్కూల్స్‌ను సందర్శించాలని ఆదేశించారు.
News November 14, 2024
Badass ఎయిర్‌లైన్స్ గురించి తెలుసా?
కఠిన పరిస్థితుల్లో దేనికీ తలొగ్గని వారిని Badassగా సంబోధిస్తారు. ఇప్పుడో Airlinesకు అదే పేరు దక్కింది. క్షిపణులు దూసుకొస్తున్నా, పొగలు కమ్మేస్తున్నా లెబనాన్‌కు చెందిన Middle East Airlines తన సర్వీసులను ఆపకుండా Badass ఎయిర్‌లైన్స్‌గా నిలిచింది. యుద్ధంలోనూ ప్రయాణికులను గమ్యానికి చేరుస్తోంది. పౌరుల కోసం ఎయిర్‌పోర్టును వాడితే దాడి చేయబోమని ఇజ్రాయెల్ హామీ ఇచ్చినట్టు ఓ కెప్టెన్ తెలిపారు.