News May 24, 2024
ఫైనల్‌కు దూసుకెళ్లిన SRH

IPL టైటిల్ వేటలో SRH దుమ్మురేపింది. క్వాలిఫయర్-2లో RRపై ఘన విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RRను హైదరాబాద్ బౌలర్లు మడతబెట్టేశారు. 139 పరుగులకే పరిమితం చేసి.. 36 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. జురెల్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం FINALలో ఇదే చెపాక్ స్టేడియంలో KKR-SRH తలపడనున్నాయి.
Similar News
News February 7, 2025
TCS ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేలో భారీ కోత

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 2024-25 Q3లో వారి వేరియబుల్ పేలో భారీ కోత పెట్టినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ వరుసగా రెండో క్వార్టర్‌లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అలవెన్స్ ఇవ్వగా, Q2లో 20-40 శాతానికి పరిమితం చేసింది. తనకు 50K-55K రావాల్సి ఉండగా Q2లో సగం, Q3లో ఇంకా తగ్గిందని ఓ ఉద్యోగి చెప్పారు.
News February 7, 2025
‘తండేల్’ మూవీ పబ్లిక్ టాక్

చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా షోలు USలో మొదలయ్యాయి. తండేల్ రాజు, సత్య పాత్రల్లో నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశ భక్తి అంశాలు, DSP మ్యూజిక్, పాటలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని, డైరెక్టర్ కాస్త ఫోకస్ చేస్తే బాగుండేదంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ
News February 7, 2025
మరోసారి SA20 ఫైనల్‌కు సన్‌రైజర్స్

‘SA20’లో ఎలిమినేటర్‌లో పార్ల్ రాయల్స్‌పై గెలిచి సన్‌రైజర్స్(SEC) ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 175/4 స్కోరు చేసింది. రూబిన్(81), ప్రిటోరియస్(59) రాణించారు. ఛేజింగ్‌లో SEC ఓపెనర్ జోర్జీ(78), జోర్డాన్(69) తడబడకుండా ఆడారు. ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టైన్(MICT)తో రేపు రాత్రి 9గంటలకు సన్‌రైజర్స్ తలపడనుంది. మార్క్రమ్ సేన తొలి రెండు సీజన్లు కప్ కొట్టిన సంగతి తెలిసిందే.