News April 10, 2024
500 ఏళ్ల తర్వాత జన్మస్థలంలో శ్రీరామ నవమి

అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే, సుమారు 500 ఏళ్ల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రామ్లల్లా నుదుటిపై 75 MM వ్యాసార్థంలో వృత్తాకార తిలకంలా 4 నిమిషాల పాటు ప్రకాశించనున్నాయి.
Similar News
News September 16, 2025
తెలంగాణ అప్డేట్స్

* ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో నూతన పాస్పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
* ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రానున్న కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. రేపు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి హాజరు.
* నల్గొండలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన పొక్సో కోర్టు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు.
News September 16, 2025
నో మేకప్.. మేకప్ లుక్ కావాలా?

ప్రస్తుతకాలంలో ‘నో మేకప్- మేకప్ లుక్’ ట్రెండ్ అవుతోంది. దీనికోసం తేలిగ్గా ఉండే మాయిశ్చరైజర్, రేడియన్స్ ప్రైమర్, ల్యుమినైజింగ్ ఫౌండేషన్ వాడాలి. డార్క్ సర్కిల్స్ కనిపించకుండా లైట్గా కన్సీలర్ రాయాలి. ఐ ల్యాష్ కర్లర్, మస్కారా, ఐ లైనర్ అప్లై చెయ్యాలి. చీక్ బోన్స్పై బ్రాంజర్, బ్లషర్ రాయాలి. మ్యూటెడ్ లిప్ కలర్, టింటెడ్ లిప్ బామ్ పెదవులకు అద్దాలి. అంతే మీ నో మేకప్ లుక్ రెడీ.
News September 16, 2025
పాడి పశువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.