News April 10, 2024

500 ఏళ్ల తర్వాత జన్మస్థలంలో శ్రీరామ నవమి

image

అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో తొలిసారి శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే, సుమారు 500 ఏళ్ల తర్వాత ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఏడాది రామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రామ్‌లల్లా నుదుటిపై 75 MM వ్యాసార్థంలో వృత్తాకార తిలకంలా 4 నిమిషాల పాటు ప్రకాశించనున్నాయి.

Similar News

News March 27, 2025

స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు

image

TG: SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్‌కూ మే 31 వరకు గడువు ఇచ్చారు.

News March 27, 2025

మీ ఫోన్‌పే, గూగుల్‌పే పని చేస్తున్నాయా?

image

నిన్న రాత్రి 7.30 గంటలకు దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్స్ పనిచేయలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అయినా కొందరు తమ సమస్య అలాగే ఉందని SMలో పోస్టులు పెట్టారు. మరి మీ యూపీఐ పేమెంట్స్ పనిచేస్తున్నాయా? కామెంట్ చేయండి.

News March 27, 2025

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

image

AP: చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. అలాగే పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున సరఫరా చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా 93,000 చేనేత కుటుంబాలతో పాటు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ పరిమితికి మించి విద్యుత్‌ను వాడితే అదనపు యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

error: Content is protected !!