News March 16, 2024
శ్రీకాకుళం: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికలు నిభందనలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News April 4, 2025
ఎచ్చెర్ల: 7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు

Dr.BR.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పరిధిలోని అఫిలియేషన్ డిగ్రీ కళాశాలల 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూజీ ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు వివరాలు వెల్లడించారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 54 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రెగ్యులర్, సప్లిమెంటరీ విధానంలో 9,000 మంది వరకు పరీక్షలకు హాజరు కానున్నారు.
News April 4, 2025
నరసన్నపేట: లారీ యాక్సిడెంట్.. తాపీమేస్త్రి మృతి

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ తాపీమేస్త్రి మృతి చెందారు. నరసన్నపేట మండలం పొలాకి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు(49) మధురవాడలో మరో వ్యక్తితో పని నిమిత్తం బైక్పై బయలుదేరారు. మారికవలస హైవేపై ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న ప్రభాకర్ రావు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
News April 4, 2025
శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన డీఎంఅండ్హెచ్ఓ

శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంపై గురువారం ఏసీబీ ఆకస్మికంగా దాడులు చేశారు. డీఎంఅండ్హెచ్ఓ బాలమురళీకృష్ణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ బీవీవీ రమణమూర్తి గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ మెడికల్ లీవ్లో ఉంది. ఆమె తిరిగి విధుల్లో చేరేందుకు లంచం అడగడంతో ఏసీబీని ఆమె ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.