News March 16, 2024

శ్రీకాకుళం: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

image

జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జీలాని సమూన్  స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికలు నిభందనలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Similar News

News October 16, 2024

25న శ్రీకాకుళంలో జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని గవర్నమెంట్ DLTC కాలేజీలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ N.శేషగిరి తెలిపారు. పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, పూర్తి చేసి 18-24 ఏళ్లు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 16, 2024

LLB పరీక్ష టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 3 సంవత్సరానికి సంబంధించి 2, 4 సెమిస్టర్ల పరీక్ష టైం టేబుల్ విడుదలైంది. వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయన్నారు.

News October 16, 2024

సంతబొమ్మాళి ఘటనలో తల్లి మృతి

image

సంతబొమ్మాలి మండలం కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులకు తల్లి విషమిచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి దుర్గ సైతం చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున 3 గంటలకు మృతిచెందినట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. చిన్నారుల మృతి అనంతరం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.