News February 21, 2025
ఓటీటీలో ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.. మీరు చూశారా?

వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల నటించిన కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతూ ఇండియాలో టాప్-6లో నిలిచింది. రైటర్ మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి మీరు ఈ మూవీ చూశారా?
Similar News
News March 23, 2025
అట్లీ సినిమాలో బన్నీ డ్యుయల్ రోల్?

తమిళ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సినిమాలో మెయిన్ విలన్ పాత్ర అదేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘పుష్ప’ సినిమాలోని పుష్పరాజ్ పాత్రలోనూ కొంతవరకు నెగటివ్ షేడ్స్ ఉన్న సంగతి తెలిసిందే.
News March 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

టీ20 ఫార్మాట్‌లో 400 మ్యాచులు ఆడిన మూడో భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. KKRతో జరిగిన మ్యాచుతో ఈ ఘనత అందుకున్నారు. అతనికంటే ముందు రోహిత్ శర్మ(448), దినేశ్ కార్తీక్ (412) ఈ ఫీట్ సాధించారు. కాగా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో కోహ్లీ (12,945) ఐదో స్థానంలో ఉన్నారు. గేల్ (14,562), హేల్స్ (13,610), షోయబ్ (13,537), పొలార్డ్ (13,537) తొలి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
News March 23, 2025
ప్రజలు కాదు.. పొలిటీషియన్లే కులతత్వవాదులు: గడ్కరీ

ప్రజలు కులతత్వవాదులు కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడతారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటుతనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్‌గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపైనా పోటీ ఉందని గడ్కరీ పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.