News March 17, 2024
శ్రీకాకుళం: మొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటి

2024 సార్వత్రిక ఎన్నికల బరిలోకి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పిరియా విజయ మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్గా కొనసాగుతున్న పిరియా విజయకు పార్టీ టికెట్ కేటాయించింది. అటు రాజాంలో డాక్టర్గా పనిచేస్తున్న తలే రాజేశ్ కూడా మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొదటిసారి కావడంతో వీరికి విజయం వరిస్తుందో..? లేదో..? వేచి చూద్దాం.
Similar News
News January 10, 2026
కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు

కొత్తూరు మండల కేంద్రంలో ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. కొత్తూరు నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ఈ ఇబ్బందులు తప్పలేదు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇలా కిక్కిరిసి గమ్యస్థానాలకెళ్లారు. ఫ్రీ బస్సు, పండగ రద్దీ కూడా దీనికి తోడైంది. అధికారులు స్పందించి తగినన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News January 10, 2026
శ్రీకాకుళం: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన మహేశ్ (27) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. ఏడాది క్రితం పలాస మండలానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం కాశీబుగ్గలో నివాసం ఉంటున్నారు. ఇరువురు మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బందులు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News January 10, 2026
SKLM: వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ విజయ సారధి హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేయరాదన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.


