News August 28, 2024

కోలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ?

image

గత ఏడాది వరుస సినిమాలతో సందడి చేసిన కుర్ర హీరోయిన్ శ్రీలీల కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న ‘అమరన్’ చిత్రంలో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Similar News

News September 9, 2024

BREAKING: ఆ రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లావ్యాప్తంగా రేపు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులిచ్చారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని చెప్పారు.

News September 9, 2024

సీఎం మమత చెప్పేవి అబద్ధాలు: ట్రైనీ డాక్టర్ తల్లి

image

కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి పేరెంట్స్‌కు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను CM మమత ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. CM అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘మీకు పరిహారం ఇప్పిస్తానని CM అన్నారు. మీ కూతురి జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చన్నారు. అయితే నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ ఆఫీస్‌కు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పా’ అని పేర్కొన్నారు.

News September 9, 2024

‘మేనన్’ నా ఇంటి పేరు కాదు: హీరోయిన్ నిత్య

image

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్ తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్‌పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని చెప్పుకొచ్చారు.