News June 21, 2024
మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి?
కేసీఆర్ లక్ష్మీ పుత్రుడిగా పేరున్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ చెప్పడంతో ఈ ప్రచారం మరింత బలపడింది.
Similar News
News September 8, 2024
‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేశ్ బాబు?
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తారక్, మహేశ్‌ను ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలుగుతుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 10న దేవర ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
News September 8, 2024
గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
APలో భారీ వర్షాలు, విజయవాడలో బుడమేరుతో సంభవించిన వరద పరిస్థితులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి CM చంద్రబాబు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రేయింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసిందని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను తెలియజేశారు. వరద వల్ల భారీ నష్టం జరిగిందని గవర్నర్‌కు చెప్పారు. అటు త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News September 8, 2024
మరో 3 జిల్లాల్లో రేపు సెలవు
APలోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాజాగా 3 జిల్లాలకు సోమవారం సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ఇస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ఇప్పటికే విజయనగరం జిల్లాలో సెలవు <<14051952>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.